Sunday, 15 June 2025
Wednesday, 11 June 2025
Tuesday, 10 June 2025
Sunday, 8 June 2025
Friday, 6 June 2025
Tuesday, 27 May 2025
Thursday, 22 May 2025
Friday, 16 May 2025
AP New Rice Card Application Process And Required Documents
రైస్ కార్డ్ సేవలు - ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు, క్రింద పేర్కొన్న అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి:
1. కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు
✅ అర్హత:
- కుటుంబ వార్షిక ఆదాయం ₹1.2 లక్షలకు లోపుగా ఉండాలి
- ఆరు దశల ప్రమాణాలను కలిగి ఉండాలి
- GSWS హౌస్ హోల్డ్ డేటాబేస్ నందు నమోదు అయ్యి ఉండాలి వారిలో ఎవరికి రైస్ కార్డ్ ఉండరాదు.
📄 అవసరమైన పత్రాలు:
- కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు
2. సభ్యుడు చేర్చడం
✅ అర్హత:
- వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పు
📄 అవసరమైన పత్రాలు:
- వివాహం ద్వారా – వివాహ ధృవీకరణ పత్రం మరియు వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో
- జననం ద్వారా – జననం ధృవీకరణ పత్రం
- చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
- ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు
3. రైస్ కార్డ్ విభజన
✅ అర్హత:
- ఒకే కార్డులో రెండు కుటుంబాలు ఉన్నప్పుడు (కనీసం 4 సభ్యులు)
📄 అవసరమైన పత్రాలు:
- సంబంధిత సభ్యుల ఆధార్ కార్డులు
- వివాహ ధృవీకరణ పత్రం
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
- ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు
4. సభ్యుడిని తొలిగించడం
✅ అర్హత:
- సభ్యుడు మరణించినప్పుడు
📄 అవసరమైన పత్రాలు:
- మరణ ధృవీకరణ పత్రం
- సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
- ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు
5. చిరునామా మార్పు
✅ అర్హత:
- ఆధార్ కార్డ్‌లో కొత్త చిరునామా నమోదై ఉండాలి
📄 అవసరమైన పత్రాలు:
- సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
6. తప్పుగా ఉన్న ఆధార్ సీడింగ్ సవరణ
✅ అర్హత:
- రైస్ కార్డ్‌లో సభ్యుడి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు
📄 అవసరమైన పత్రాలు:
- సంబంధిత సభ్యుడి సరైన ఆధార్ కార్డు
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
- ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు
📌 గమనిక:
పై సేవల కోసం దరఖాస్తులు సంబంధిత రుసుము మరియు అవసరమైన పత్రాలతో కలిసి మీ సచివాలయంలో సమర్పించండి.🌱
All Applications Link