సినిమా : రారండోయ్.. వేడుక చూద్దాం
నటీనటులు : నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్ తదితరులు
నిర్మాత : నాగార్జున అక్కినేని
కథ – మాటలు – దర్శకత్వం : కళ్యాణ్‌కృష్ణ కురసాల
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ : ఎస్.వి.విశ్వేశ్వర్
ఎడిటర్ : గౌతంరాజు
బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
రిలీజ్ డేట్ : 26-05-2017
నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రారండోయ్.. వేడుక చూద్దాం’. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’ తరహాలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఈ చిత్ర నిర్మాత అక్కినేని నాగార్జున చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆ సినిమాలాగే ఇది కూడా ఆడియెన్స్‌ని అలరిస్తుందని, చైతూ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని యూనిట్ ప్రచారం చేస్తూ వచ్చింది. మరి ఆ అంచనాల్ని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి..
కథ : భ్రమరాంబ (రకుల్‌ప్రీత్‌సింగ్) ఒక పల్లెటూరు అమ్మాయి. చాలా గారాబంగా పెరిగిన ఈమె.. మనసులో ఏది ఫిక్స్ అవుతుందో దానికే కట్టుబడి వుంటుంది. తన కుటుంబసభ్యులతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్న భ్రమరాంబ అనుకోని సందర్భంలో పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు తల్లి అక్కడున్న అబ్బాయిలతో జాగ్రత్తగా వుండమని మందిలిస్తే.. తాను ఎలాంటి తప్పు చేయనని, తండ్రి చూసిన సంబంధాన్నే చేసుకుంటానని అమ్మకి మాటిచ్చి, పట్టణానికి బయలుదేరుతుంది.