ముంబయి: నగదు కొరతతో కష్టాల పాలైన ప్రజలకు కాస్తా ఊరట కలిగించడానికి సోమవారం రిజర్వు బ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది ఏటీఎంల ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై డిసెంబరు 30వ తేదీ వరకు ఛార్జీలను రద్దు చేసింది. ఇది సేవింగ్స్ బ్యాంకు ఖాతాదార్లకు వర్తిస్తుంది.
ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి నెలకు అయిదు సార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడు సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 వంతున వసూలు చేస్తారు.
పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో ఏటీఎంల నుంచి పలుమార్లు నగదు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకొంది.

No comments:
Post a Comment