బాలీవుడ్ లో మంచి హిట్ అయిన విక్కీ డోనర్ రీమేక్ గా ఈ రోజు రిలీజ్ అయిన ఈ 'నరుడా డోనరుడా' రివ్యూ:
వాస్తవానికి ఇది ఓ స్పెర్మ్ డోనర్ కథ . ఇలాంటి కాన్సెప్టు తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావటం గొప్ప విషయమే. అందుకే రిలీజ్ అయ్యి ఇంతకాలం అయ్యినా రీమేక్ అవకుండా ఆగిపోయింది. అయితే సుమంత్ మనసు పడి మరీ ఈ ప్రాజెక్టుని ముందుకు తెచ్చాడు. ఈ నేపధ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా.. అర్థమయ్యేలా ఈ సినిమాను తీసారా? సుమంత్ కెరీర్ కు ఈ సినిమా ఏమన్నా ఉపయోగపడుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
కథ :
క్రికెటర్ విక్కీ (సుమంత్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తన అవసరాల కోసం ఏదైనా చివరకు తన ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లను కూడా అమ్మేసే టైపు. అతని తల్లి (శ్రీలక్ష్మి) బ్యూటీ పార్లర్ నడుపుతూంటుంది.. నాయనమ్మలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. పనిలో పనిగా ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్ (పల్లవి సుభాష్) అనే బెంగాలీ అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. తాను కూడా కాదనటమెందుకు అని మెల్లమెల్లగా విక్కీతో ప్రేమలో పడిపోతుంది.
అయితే తాను ఇది వరకే ఒకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో విడాకులు తీసుకున్న విషయాన్ని విక్కీకి ముందే చెబుతుంది. విక్కీ మాత్రం ఆషిమా దగ్గర ఓ నిజం దాస్తాడు. కానీ ఆషిమా దగ్గర దాచిన విషయం వింటే ఆమె ఒప్పుకోదని అనుమానం.
ఇంతకీ విక్కీ దాచిన నిజం ఏమిటీ అంటే.. తనో స్పెర్మ్ డోనర్. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) బలవంతం చేయడంతో తన వీర్యాన్ని దానం చేయడానికి ఒప్పుకొంటాడు.ఈ నిజం దాచి అషిమాని పెళ్లి చేసుకొంటాడు.
See remaining story in Theater
రీమేక్ లు చేసేటప్పుడు ఇక్కడ నేటివిటీ కోసం పాకులాడుతూంటారు దర్శక,నిర్మాతలు. అయితే అదే సమయంలో అంత రేటు పెట్టి కొన్న సినిమాలో సీన్ మార్చాలన్నా బాధ వేస్తుంది. అంతేకాకుండా ఆ ఒక్క సీనే జనాలకు అక్కడ కనెక్టు అయ్యిందేమో మనం మార్చటమెందుకు అని కూడా అనిపిస్తుంది. అలా రీమేక్ సినిమాలు చాలా సార్లు కట్ అండ్ పేస్ట్ గా మారి మన ముందుకు వస్తాయి.
ఇంతోటి దానికి డబ్బింగ్ చేస్తే సరిపోయేది కదా అని ఒరిజనల్ చూసిన వారికి అనిపించటం జరుగుతంది. బాలీవుడ్ లో మంచి హిట్ అయిన విక్కీ డోనర్ రీమేక్ గా ఈ రోజు రిలీజ్ అయిన ఈ 'నరుడా డోనరుడా' మీద కూడా అలాంటి ఆలోచనే కలుగుతుంది. అయితే ఓ మంచి సాహసోపేతమైన ప్రయత్నంగా మాత్రం దీన్ని మెచ్చుకోవాల్సిందే.
Rating 3/5
ఈ సినిమాకి పనిచేసిన టీమ్ బ్యానర్: రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ నటీనటులు: సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ల భరణి, సుమనశెట్టి, శ్రీలక్ష్మి, శేషు, భద్రమ్, తదితరులు సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీరణ్ పాకాల, ఎడిటర్ః కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ః రామ్ అరసవెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్రగడ, సాగర్ రాచకొండ, లైన్ ప్రొడ్యూసర్ః డా. అనిల్ విశ్వనాథ్, నిర్మాతలు: వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట, దర్శకత్వం: మల్లిక్‌రామ్ సమర్పణః అన్నపూర్ణ స్టూడియోస్, విడుదల: శుక్రవారం, నిడివి: 2 గంటల 5 నిమిషాలు

No comments:
Post a Comment