Tuesday, 30 May 2017

వార్మప్ మ్యాచ్‌లో భారత్ దెబ్బకి బంగ్లాదేశ్ ఢమాల్..! || India wins the second warm up match with big margin || Bangladesh looses the warmup to india bating failure

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ స్ఫూర్తివంతమైన విజయాన్ని సాధించింది. కెన్నింగ్టన్ ఒవెల్ వేదికగా బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 240 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దినేశ్ కార్తీక్ (94: 77 బంతుల్లో 8x4, 1x6), హార్దిక్ పాండ్య (80 నాటౌట్: 54 బంతుల్లో 6x4, 4x6), ఓపెనర్ శిఖర్ ధావన్ (60: 67 బంతుల్లో 7x4) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.

ఛేదనలో భువనేశ్వర్ కుమార్ (3/13), ఉమేశ్ యాదవ్ (3/16) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న బంగ్లాదేశ్ 23.5 ఓవర్లలోనే 84 పరుగులకు కుప్పకూలిపోయింది. ఆ జట్టులో మెహది హసన్ (24: 34 బంతుల్లో 4x4) ఒక్కడే కాసేపు భారత్ బౌలర్లకి శ్రమ కల్పించాడు. బంగ్లా జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేక చేతులెత్తేయడం విశేషం.

జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంకానుండగా.. జూన్ 4న భారత్ తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో ఢీకొనబోతోంది. న్యూజిలాండ్‌తో గత ఆదివారం ముగిసిన తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో భారత బ్యాట్స్‌మెన్‌కి సరైన ప్రాక్టీస్ దొరకలేదు. కానీ.. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్‌కి మంచి ప్రాక్టీస్ దొరకగా.. బౌలర్లు లయను అందుకోగలిగారు.




1 comment: