నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజైన బాహుబలి ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటలు అంతే ఈజీగా మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
సాహోరే బాహుబలి : ఎగ్జాక్ట్ గా సిచ్యువేషన్ గెస్ చేయడం కొంచెం కష్టమే కానీ.. డెఫ్ఫినేట్ గా బాహుబలి గొప్పతనాన్ని, తల్లికొడుకుల మధ్య ఉన్న రిలేషన్ ని హైలెట్ చేసే సాంగ్. ఈ పాట మధ్యలో కీరవాణి పాడే టూ లైనర్ పాటకే హైలెట్. రాజమౌళి విజువలైజేషన్ కు మరింత స్కోప్ నిచ్చే ఈ సాంగ్ ని దలేర్ మెహందీ, కీరవాణి, Dr. K. రామకృష్ణ పాడారు. K. శివశక్తి దత్త, Dr. K. రామకృష్ణ కలిసి లిరిక్స్ అందించారు.
హంసనావ : బాహుబలి 2 లోని అల్టిమేట్ రొమాంటిక్ సాంగ్. ‘మెచ్చిందిలే దేవసేన’ అంటూ సాగే ఈ సాంగ్ వింటుంటేనే రాజమౌళి మార్క్ విజువల్స్ కళ్ళ ముందు కదులుతున్నాయి. డెఫ్ఫినేట్ గా సినిమాకి వన్ ఆఫ్ ది ఎసెట్ అనిపించుకునే సాంగ్. సోని, దీపు కలిసి పాడిన ఈ సాంగ్ కి చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాశాడు.
కన్నా నిదురించరా : శ్రీనిధి, శ్రీ సౌమ్య పాడిన ఈ పాటకి కీరవాణి స్వయంగా లిరిక్స్ రాశాడు. బాహుబలి 2 పాటలన్నింటిలో కాస్త డిఫెరెంట్ గా కంపోజ్ అయిన సాంగ్ ఎవరైనా ఒక్కసారి వింటే, ఈజీగా హమ్ చేయడం బిగిన్ చేస్తారు.
దండాలయ్య : బాహుబలి సినిమా మొత్తానికే హై ఎండ్ ఇమోషనల్ సాంగ్. పడమర కొండల్లో వాలిన సూరీడా.. అంటూ సాగే ఈ సాంగ్ డైరెక్ట్ గా గుండె అంచుల్ని తాకుతుంది. కీరవాణి మార్క్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్ కాళభారవ పాడాడు. ఈ పాటకి కూడా కీరవాణి లిరిక్స్ రాశాడు.
ఒక ప్రాణం : ఆవేశంగా సాగిపోయే ఈ సాంగ్ బాహుబలి 2 లో రివీల్ కాబోయే మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చిందీ..? బాహుబలి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందీ లాంటి క్వశ్చన్స్ సమాధానం దొరికిన వెంటనే బిగిన్ అయ్యేలా అనిపిస్తుంది. సిచ్యువేషనల్ గా సాగే ఈ సాంగ్ ని కాళభైరవ పాడాడు. కీరవాణి లిరిక్స్ రాశాడు.
This comment has been removed by the author.
ReplyDelete