Thursday 23 March 2017

కాటమరాయుడు రివ్యూ || Pawan Kalyan New Movie Katamarayudu Review and Rating || Sruthi Hassan Anup rubens

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్….ఈ పేరుకున్న పవర్ మామూలుగా ఉండదు. ఏ సినిమా ఫంక్షన్ అయినా….సినిమా థియేటర్‌లో అయినా ఈ పేరు వినిపిస్తే విజిల్స్ మోత మోగాలి. అరుపులు, కేకలతో దద్ధరిల్లిపోవాలి. అంతా కూడా పవన్ ఫ్యాన్స్ మహిమ. అందుకే ఇప్పుడు పవన్ కూడా ఆ ఫ్యాన్స్ కోసమే ‘కాటమరాయుడు’ సినిమాతో ముందుకొచ్చాడు.

కథ గురించి చెప్పుకోవాలంటే…………..తన నలుగురు తమ్ముళ్ళను విపరీతంగా ప్రేమించే అన్న కాటమరాయుడు. భార్య వస్తే ఎక్కడ అన్నదమ్ములను వేరుచేస్తుందో అన్న భయంతో పెళ్ళి కూడా చేసుకోడు. కానీ వయసుకొచ్చిన తమ్ముళ్ళు మాత్రం లవ్ స్టోరీలకు రెడీ అయిపోతారు. వాళ్ళ లవ్ స్టోరీలు సక్సెస్ అవ్వాలంటే అన్నను కూడా లవ్‌లోకి దింపాలనుకుంటారు. అందుకోసం లింగబాబు(అలీ) సాయం తీసుకుంటారు. కొత్తగా ఆ ఊర్లో అడుగుపెట్టిన అవంతి(శృతీహాసన్)తో కాటమరాయుడిని కలపాలని ప్రయత్నాలు చేస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరికి…కాటమరాయుడు అవంతిని ప్రేమిస్తున్నాడని అవంతికి, అవంతి కాటమరాయుడిని ప్రేమిస్తుందని కాటమరాయుడికి చెప్తారు. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ భాగం ఉండే డ్రామా ఇదే. వీళ్ళ లవ్ స్టోరీ ఓ కొలిక్కి వచ్చే టైంకి కాటమరాయుడు హింసా నేపథ్యం గురించి తెలుసుకున్న అవంతి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అవంతికి హింస అంటే ఇష్టం ఉండదు. ఆ తర్వాత కాటమారాయుడే తన తమ్ముళ్ళతో కలిసి అవంతి ఇంటికి వెళతాడు. అక్కడ అవంతి కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యలేంటి? వాటిని కాటమరాయుడు ఎలా తీర్చాడు అన్నది కథ.

కథలో ఉన్న విషయం అయితే చాలా చాలా తక్కువ. అలాంటి నేపథ్యంలో ఇక సినిమాను నిలబెట్టాల్సింది ఆర్టిస్లులే. మరీ ముఖ్యంగా కథనాయకుడే. ఆ పనిని సమర్థవంతంగా చేశాడు పవన్. అక్కడే మనకు పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ కూడా తెలుస్తుంది.
ఫైనల్ వర్డ్ః పవర్ స్టార్‌తో….పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం…….
ఆడియెన్స్ ఒపీనియన్ః నేను పవన్ ఫ్యాన్……ఆయన సినిమా ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. కాటమరాయుడు నచ్చింది.

No comments:

Post a Comment