మొన్నటివరకు ఎటిఎం లో డబ్బులు రాక ఇబ్బందులు పడ్డాము. కానీ ఇప్పుడు డబ్బులు డ్రా చేయాలన్న, అకౌంట్ లో డబ్బులు వేయాలన్న ఇబ్బంది పడాల్సి వస్తుంది. కేవలం మూడు సార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. ఆ పై ట్రాన్సాక్షన్ లకు చార్జీలు విధించనుంది స్టేట్ బ్యాంకు. ఏప్రిల్ 1 నుండి ఇది అమలులోకి రానుంది. డబ్బులు డ్రా చేయడానికి ఇబ్బంది పడుతున్న మనకి స్టేట్ బ్యాంకు క్రెడిట్ కార్డు రూపం లో ఆఫర్ ప్రకటించి కొంత ఊరటనిచ్చింది. క్రెడిట్ కార్డు అంటే ఎంతో డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఉచితంగా పొందొచ్చు. ఎలాంటి అధిక రుసుము ఉండదు! వివరాలు మీరే చూడండి!
క్రెడిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. మీ ఖాతాలో 20వేల రూపాయలు ఉంటే చాలు.. ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా వాడుకోవచ్చని ఎస్‌బీఐ చీఫ్ తెలిపారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ‘ఉన్నతి’ అనే పథకం కింద ఉచిత క్రెడిట్‌కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించింది SBI. వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేకుండా.. ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వారికి ఈ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. ప్రతిఏటా విధించే ఛార్జీలను కూడా మినహాయిస్తామని చెబుతోంది
ఖాతాల్లో కనీస నిల్వలు ఉండాల్సిందేనని ఇటీవల ఎస్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ప్రకటనపై ఖాతాదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేక వచ్చింది. ‘మా డబ్బుపై మీ పెత్తనం ఏమిటి?’ అని ఎస్‌బీఐని నిలదీశారు. ఈ నేపథ్యంలో… వినియోగదారులే ఖాతాల్లో నిల్వలు ఉంచేలా చేసేందుకు ఈ ఉచిత క్రెడిట్ కార్డును ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

This comment has been removed by the author.
ReplyDelete