Friday, 3 March 2017

‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’రివ్యూ || Review of the movie Kittugadu Unnadu Jagratha Raj Tarun Telugu movie

రాజ్ తరణ్ కూడా చాలా తెలివైన వాడు. రొటీన్ కథాంశాలు ఎంచుకుంటే రొటీన్ గానే అతి తక్కువ కాలంలో అవుట్ డేట్ అయిపోతాను అని అర్దం చేసుకుని, కొత్త బ్యాక్ డ్రాప్ లతో కూడిన కథలు ఎంచుకుంటున్నాడు. మినిమం గ్యారెంటీగా కామెడీని పెట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా డాగ్ కిడ్నాపర్ అంటూ కొత్త బ్యాక్ డ్రాప్ తో ముందుకు వచ్చి క్యూరియాసిటీ పెంచేసాడు.

కథ...
ఫస్టాఫ్ మొత్తం కుక్కల కిడ్నాప్ లు, తన లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ని ఓ డాన్ కు చెప్పటం వంటి వాటితో నిండిపోయింది. అంటే సెటప్ తోనే ఫస్టాఫ్ మొత్తం నింపేసారు. ఇంటర్వెల్ దాకా అసలు కథలోకే రాలేదు. దాంతో ఏదో జరుగుతోంది అంటే జరుగుతోంది అన్నట్లుగా సీన్స్ వచ్చి పోతున్నట్లుగా ఫస్టాఫ్ లో అనిపించాయి. ఇంటర్వెల్ ముందు హీరో,హీరోయిన్స్ విడిపోవడం, హీరోయిన్ కిడ్నాప్ కు గురికావడంతో కథలోఇంట్రెస్ట్ మొదలవుతుంది.
ఇంటర్వెల్ దగ్గర కథ మొదలెట్టిన దర్శకుడు సెకండాఫ్ ని పరుగెట్టించాలనే ప్రయత్నం చేసాడు. అలాగే ...విలన్ క్యారక్టర్ కూడా సెకండాఫ్ లోనే మొదలవుతుంది. అయితే విలన్ కు, హీరో కు మధ్య పోరు మాత్రం ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ కు పది నిముషాల ముందు దాకా మొదలు కాలేదు. దాంతో ప్రీ క్లైమాక్స్ నుంచే కథ బాగున్నట్లు అనిపిస్తుంది.

సినిమాలో అనూప్‌రూబెన్స్‌ అందించిన సంగీతం బాగుంది. ఎందగానో పబ్లిసిటీ చేసి వదిలిన ఐటమ్‌ సాంగ్‌ అసలు సినిమాలో కిక్‌ ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగినట్టు సాగింది. బుర్రా సాయిమాధవ్‌ డైలాగులు ఆయన గత సినిమాల స్దాయిలో లేవు. కెమేరా, ఎడిటింగ్‌ అన్నీ సినిమాకు తగ్గట్లే ఉన్నాయి.

No comments:

Post a Comment