Amaravathi :
శాసనసభ, శాసన మండలి సమావేశ మందిర భవనాన్ని సంప్రదాయబద్దంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వేద మంత్రోత్సారణతో అసెంబ్లీ భవనం ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుడి పటంతో సీఎం భవనంలోకి ప్రవేశించి పూజలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజధాని ప్రాంత రైతులు, కుటుంబసభ్యులు భారీగా తరలివచ్చారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అతితక్కువ సమయంలో భవనం నిర్మాణానికి కృషి చేసిన సీఆర్‌డీఏ కమీషనరు చెరుకూరి శ్రీధర్, ఎల్‌అండ్‌టీ అధికారులను, గుంటూరు జిల్లా కలెక్టరు కాంతిలాల్‌దండేలను దుశ్శాలువాతో సత్కరించారు. మార్చి 6 నుంచి ఈభవనంలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.

No comments:
Post a Comment