Thursday, 23 March 2017

Attack on London Parliament British Parliament Attacked by the terrorists || లండన్ పార్లమెంట్ వెలుపల దాడి


బ్రిటన్ పార్లమెంట్ వెలుపల బుధవారం ఉగ్రదాడులకి పాల్పడింది తామేనని ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. బుధవారం లండన్‌లోని పార్లమెంట్‌కి దారితీసే ప్రవేశానికి అతి సమీపంలో వున్న వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై విచక్షణారహితంగా దాడులకి పాల్పడిన ఓ వ్యక్తి.. ముగ్గురు పౌరులని, ఓ పోలీస్ ఆఫీసర్‌ని పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని కాల్చిచంపడంతో ఆ హింసకి అంతటితో తెరపడినట్టయింది.

ఘటన జరిగిన వెంటనే ఈ దాడికి పాల్పడింది తామేనని ఎవ్వరూ బాధ్యత తీసుకోనప్పటికీ, ఘటన జరిగిన తీరుతెన్నులని పరిశీలించిన అనంతరం ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనే అయ్యుంటుంది అని అనుమానిస్తున్నట్టుగా లండన్ పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. వాళ్లు ఊహించినట్టుగానే తాజాగా ఇస్లామికి స్టేట్ అనుబంధ సంస్థ ఈ పనిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పనిగా ప్రకటించుకున్నట్టుగా ఏఎఫ్‌పీ పేర్కొంది.

ఇదిలావుంటే, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన లండన్ దర్యాప్తు బృందాలు లండన్, బర్మింగ్‌హమ్‌లలో కలిపి మొత్తం ఏడుగురు అనుమానితులని అదుపులోకి తీసుకున్నాయి.

No comments:

Post a Comment