క్రికెట్ ప్రపంచంలో స్లెడ్జింగ్ రారాజు ఎవరంటే.. ఆస్ట్రేలియా అని టక్కున చెప్తారు ఎవరైనా! మైదానంలో ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లే కాదు.. గ్యాలరీలో కూర్చున్న ఆస్ట్రేలియా అభిమానులు సైతం ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేస్తారు. మంచి ఊపుమీదున్న బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్‌ను సైతం తమ నోటితో ఇబ్బందిపెట్టగల సత్తా వారిది. అయితే విరాట్ కోహ్లి విషయంలో మాత్రం కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ ప్రస్తుత కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు జట్టు సభ్యులను హెచ్చరించాడు.
టీం ఇండియాతో నాలుగు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా ఈ నెలలోనే భారత్‌కు రానుంది. తొలి టెస్ట్ ఫిబ్రవరి 23న పుణేలో ప్రారంభం అవుతుంది. రెండో టెస్ట్ మార్చి 4న బెంగళూరులో, మూడో టెస్ట్ మార్చి 16న రాంచీలో, నాలుగో టెస్ట్ మార్చి 25న ధర్మశాలలో ప్రారంభమవుతాయి.

No comments:
Post a Comment