Friday, 10 February 2017

ఓం నమో వెంకటేశాయ రివ్యూ & రేటింగ్ || Omm Namo Venkateshaya review and rating telugu film nagarjuna

సినిమా:ఓం నమో వెంకటేశాయ
రిలీజ్ డేట్:10 ఫిబ్రవరి 2017
నటీనటులు:నాగార్జున,అనుష్క,ప్రగ్వా జైస్వాల్,జగపతిబాబు,సౌరబ్ రాజ్ జైన్
డైరెక్టర్ & స్క్రీన్ ప్లే:కె.రాఘవేంధ్ర రావు
కథ,మాటల:కె.భారవి
నిర్మాత:ఎ.మహేష్ రెడ్డి
సంగీతం:ఎం.ఎం.కీరవాణి
కెమెరామెన్:యస్.గోపాల్ రెడ్డి
ఎడిటింగ్:గౌతం రాజు
బ్యానర్:ఎ.ఎం.ఆర్ సాయి క్రుప ఎంటర్ టైన్మెంట్స్


కథ :
16 వ శతాబ్దం లో మొదలవుతుంది.రామ అనే ఒక భక్తుడు (నాగార్జున) తరచూ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల వెళుతూ ఉంటాడు.వెకటేశ్వరస్వామి మీద ఆయనకు ఉన్న భక్తితో తన మరదలి భవాని తో (ప్రగ్వా జైస్వాల్) తో పెళ్ళి కుదిర్చినా కాని వద్దని చెప్పి తిరుమలకు వెళ్తాడు.ఇక ఎప్పుడు చూసినా తిరుమల లో ఉంటున్న రామ ను చూసి ఆలయ అధికారులలో ఒకరు అయిన గోవిందరాజు(రావు రమేష్) అనుమానం తో రాం ను తన మనుషులతో గుడి నుంచి బయటకు వెలేస్తాడు.ఇక నిరాశతో రామ అక్క్డే ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాడు.ఇక రామ గోవిందరాజు అగమ శాస్త్రం పాటించడం లేదని తన పై తిరుగుబాటు చేస్తాడు రామ.దీనికి భక్తుల సహకారం కూడా దొరకడం తో మళ్ళీ గుడికి వెళ్ళడం ప్రారంభిస్తాడు.అయితే తన భక్తిని మెచ్చిన స్వామి ఒక రోజు కలలో కనిపిస్తాడు.ఇక తర్వాత నిజం గానే రామ ముందు ప్రత్యక్షమవుతాడు.ఇక వీరిద్దరూ కలసి పాచికలు ఆడడం జరుగుతుంది.అయితే ఒకరోజు స్వామి ఆటలో తన నగలన్నీ కోల్పోతాడు.అదే సమయం లో తిరుమల లో నగల దొనగతనం జరుగుతంది.ఇక ఆలయ పెద్దలు అందరూ ఈ నగలు దొంగతనం చేసింది రామ అని తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తనికీలు చేయగా అక్కడ నగలు ఉండడం తో ఇక వారు రామ ను బంధిస్తారు.అయితే రామ ఆ నింద నుంచి ఎలా బయటపడ్డాడు?హథీరాం బాబా గా ఎలా మారాడు? చివరికి అతని భక్తి అతడ్ని ఎక్కడకు చేర్చింది ? అనేదే ఈ సినిమా కథ

ప్లస్ పాయింట్స్:
*నాగార్జున నటన,సౌరబ్ రాజ్ జైన్
* డైరెక్షన్
*సంగీతం
*సాంగ్స్
*కెమెరా పనితనం

మైనస్ పాయింట్స్:
* సంధర్భం లేకుండా వచ్చే పాటలు
*గత సినిమాలలో ఉన్న ఎమోషన్ దీనిలో మిస్స్ అయ్యింది.
చివరిగా: ఈ ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం వేంకటేశ్వర స్వామి భక్తులనేగాక ఇతర ప్రేక్షకులను కూడా భక్తి ప్రవాహంలో ముంచగలిగే చిత్రం
రేటింగ్:3.5/5

No comments:

Post a Comment