హైదరాబాద్: ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవి సింధు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ లో అత్యుత్తమ వరల్డ్ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. ఇండియా ఓపెన్ గెలుపుతో ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకున్న సింధు మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్.2 స్థానాన్ని దక్కించుకుంది. వరల్డ్ నంబర్.1 స్థానంలో చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ జుయింగ్ నిలిచింది. మూడో స్థానంలో ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ నిలిచింది. వరల్డ్ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ తాజా ర్యాంకులను ప్రకటించింది. ప్రస్తుతం వరల్డ్ నంబర్.2 ర్యాంకును దక్కించుకున్న సింధు అంతకుముందు ఐదో స్థానంలో ఉంది.
ఇక మరో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ 9వ స్థానంలో నిలిచింది. 2015లొ వరల్డ్ నంబర్.1 ర్యాంకు సాధించిన సైనా ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేక కాస్త వెనకబడిపోయింది. తాజా ర్యాంకింగ్స్ పీవి సింధుకు మరింత ఆత్మవిశ్వాసం ఇచ్చేవిగా మారాయి.

No comments:
Post a Comment