రాజ్‌కోట్: బౌలింగ్‌లో ఆండ్రూ టై హ్యాట్రిక్ సాధించిన వేళ.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చిన సమయాన గుజరాత్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. పుణే నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని లయన్స్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాసంగా చేధించింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 47), బ్రెండన్ మెక్‌కల్లమ్ (32 బంతుల్లో 49) గుజరాత్‌కు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా కెప్టెన రైనా, ఫించ్ మిగతా పని పూర్తి చేశారు. స్మిత్-మెక్‌కల్లమ్ జోడి తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలోనే 94 పరుగులు జోడించింది.
ఐపీఎల్‌లో అరంగేట్రంతోనే సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన ఆండ్రూ టైని చూశాక ఆ జట్టు కెప్టెన్ సురేశ్ రైనా ఎంత ఆనందించాడో.. అంత కంటే ఎక్కువగా తనను తాను తిట్టుకొని ఉంటాడు. ఒక్క రైనానే కాదు.. ఆ జట్టు కోచ్, మేనేజ్‌మెంట్ అంతా ఇలాగే చేసి ఉంటారు. ఎందుకంటే.. తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే టై హ్యాట్రిక్ సహా.. ఐదు వికెట్లు పడగొట్టాడు. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ బౌలర్లు తీసింది కేవలం ఒకే ఒక్క వికెట్.

This comment has been removed by the author.
ReplyDelete