పదో సీజన్‌లో బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఓపెనర్లు షేన్ వాట్సన్ (1), విష్ణు వినోద్ (7)తో పాటు కేదార్ జాదవ్ (1) నిరాశపరచడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికే బెంగళూరు 22/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. వెన్నునొప్పి కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన డివిలియర్స్.. తొలుత క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడినా స్లాగ్ ఓవర్లలో గేర్ మార్చి వరుస సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 16వ ఓవర్ వేసిన వరుణ్ అరోన్ బౌలింగ్‌లో ఓ సిక్స్ బాదిన ఏబీ.. స్టాయినిస్ వేసిన 17 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదేశాడు. 18 ఓవర్‌లో స్టువర్ట్ బిన్నీ (18 నాటౌట్ : 20 బంతుల్లో 1x4, 1x6) ఒక ఫోర్, సిక్స్ కొట్టగా.. ఏబీ కూడా ఓ బంతిని స్టాండ్స్‌లోకి తరలించేశాడు. డివిలియర్స్ దూకుడు పెంచడంతో 19వ ఓవర్‌ని సీనియర్ బౌలర్ సందీప్ శర్మ చేతికి పంజాబ్ కెప్టెన్ మాక్స్‌వెల్ బంతి ఇవ్వగా.. ఆ ఓవర్‌లోనూ ఈ హిట్టర్ ఒక ఫోర్, రెండు వరుస సిక్సర్లతో 19 పరుగులు రాబట్టేశాడు. చివరిగా 20వ ఓవర్ వేసిన మోహిత్ శర్మ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్ని డివిలియర్స్ సిక్స్‌లుగా మలచడంతో బెంగళూరు మెరుగైన స్కోరు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి బంతిని ఏబీ భారీ షాట్ ఆడగా బంతి ఏకంగా స్టేడియం దాటి వెళ్లిపోవడం విశేషం. ఏబీ డివిలియర్స్, స్టువర్ట్ బిన్నీ జోడి ఐదో వికెట్‌కి 6.5 ఓవర్లలోనే అజేయంగా 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. పంజాబ్ బౌలర్లలో వరుణ్ అరోన్ 2 వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, అక్షర్ చెరో వికెట్ తీశారు.
Monday, 10 April 2017
ఏబీ మెరుపులు...పంజాబ్ గెలుపు || Punjab second victory in the IPL 10 RCB vs Kings IX Punjab || ABD 8

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment