Friday, 7 April 2017

Pune wins on First match Against Mumbai || Mumba loss the opening game vs Pune || Smith and Rahane show gives Pune to break home ground tragedy

నాయకుడిని మార్చి.. పేరులో స్వల్ప మార్పు చేసిన రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ కొత్త సీజన్‌ను అద్భుతంగా ఆరంభించింది. తమ ఆరంభ మ్యాచ్‌లోనే సూపర్‌ షోతో అదరగొట్టింది.

ఆఖరి ఓవర్‌ వరకూ నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో పుణెదే పైచేయి. కొత్త సారథి స్టీవ్‌ స్మిత (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు, అజింక్యా రహానె (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులు తోడవడంతో గురువారం ఇక్కడి ఎమ్‌సీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య పుణె ఏడు వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పుణె మూడు వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 184 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38), హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 35 నాటౌట్‌), నితీష్‌ (34) రాణించారు. పుణె బౌలర్లలో తాహిర్‌ 3, రజత భాటియా 2 వికెట్లు తీశారు. స్మితకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

స్కోరుబోర్డు 
ముంబై: పార్థివ్‌ పటేల్‌ (బి) తాహిర్‌ 19, బట్లర్‌ (ఎల్బీ) తాహిర్‌ 38, రోహిత్ (బి) తాహిర్‌ 3, నితీష్‌ రాణా (సి) భాటియా (బి) జంపా 34, రాయుడు (సి అండ్‌ బి) భాటియా 10, క్రునాల్‌ పాండ్యా (సి) ధోనీ (బి) భాటియా 3, పొలార్డ్‌ (సి) అగర్వాల్‌ (బి) స్టోక్స్‌ 27, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 35, సౌథీ (రనౌట్‌) 7, మెక్లెనగన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 184/8; వికెట్ల పతనం: 1-45, 2-61, 3-62, 4-92, 5-107, 6-125, 7-146, 8-183; బౌలింగ్‌: దిండా 4-0-57-0, చాహర్‌ 2-0-21-0, బెన్‌ స్టోక్స్‌ 4-0-36-1, తాహిర్‌ 4-0-28-3, ఆడమ్‌ జంపా 3-0-26-1, భాటియా 3-0-14-2.
పుణె: రహానె (సి) రాణా (బి) సౌథీ 60, మయాంక్‌ (సి) రోహిత్ (బి) మెక్లెనగన్‌ 6, స్మిత్ (నాటౌట్‌) 84, స్టోక్స్‌ (సి) మెక్లెనగన్‌ (బి) హార్దిక్‌ పాండ్యా 21, ధోనీ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.5 ఓవర్లలో 187/3; వికెట్లపతనం: 1-35, 2-93, 3-143; బౌలింగ్‌: సౌథీ 4-0-34-1, హార్దిక్‌ పాండ్యా 4-0-36-1, మెక్లెనగన్‌ 4-0-36-1, బుమ్రా 4-0-29-0, క్రునాల్‌ పాండ్యా 2-0-21-0, పొలార్డ్‌ 1.5-0-30-0.


No comments:

Post a Comment