Friday, 14 April 2017

అఫ్ఘాన్‌పై మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ దాడి || America attak on afganistan with Mother of All bombs || a Warning to Siriya ICS



సిరియాపై కయ్యానికి కాలు దువ్వుతోన్న అమెరికా…, ఐసిస్‌ని అంతమొదించే పేరుతో అఫ్ఘానిస్తాన్‌పై భారీ బాంబును ప్రయోగించింది. బాంబు అంటే ఇదేదో చిన్నా చితకాది కాదు. 21,600పౌండ్లు బరువు అంటే దాదాపు 9,720 కిలోలకు సమానమైన ఏంఓఏబీ బాంబును అఫ్ఘాన్‌పై ప్రయోగించింది. 2003 యుద్ధసమయంలోనే దీనిని తయారు చేసినా ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రయోగించలేదు. జీబీయూ 43బి బాంబును అప్ఘాన్‌ కాలమానం ప్రకారం రాత్రి 7.32కు ప్రయోగించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ ధృవీకరించింది. అణ్వాయుధ రహితమైన అతిపెద్ద బాంబును యుద్ధ క్షేత్రాలలో ప్రయోగించడం ఇదే తొలిసారి. జీపీఎస్‌ ఆధారంగా ఖచ్చితమైన లక్ష్యాలను చేధించే ఉద్దేశంతో ఎంసీ 130 యుద్ధం విమానం నుంచి దీనిని ప్రయోగించారు. సాధారణ పౌరులు చనిపోకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని అమెరికా చెబుతున్నా బాంబు దాడిలో ఎంత మేరకు నష్టం వాటిల్లిందో తెలియరాలేదు. అఫ్ఘాన్‌లో ఐసిస్‌ కె దళాలను లక్ష్యంగా చేసుకుని బాంబు ప్రయోగం చేసినట్లు వైట్‌ హౌస్ ప్రకటించింది. అఫ్ఘాన్‌ పర్వత శ్రేణుల్లోని సొరంగాల్లో దాగిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు ఈ బాంబు సరైనదని అమెరికా రక్షణ వర్గాలు ప్రకటించాయి. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌గా పిలిచే బాంబును సాంకేతికంగా మాసివ్ ఆర్డినెన్ప్ ఎయిర్‌ బ్లాస్ట్‌గా పిలుస్తారు. అమెరికా ఈ బాంబును తయారు చేసిన కొద్ది కాలానికి రష్యా అంతకంటే శక్తి వంతమైన ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్‌ను తయారు చేసింది.


1 comment: