Friday, 14 April 2017

బౌలర్ సునీల్ నరైన్ తో ఓపెనింగ్.. గంభీర్ ప్రయోగం సూపర్ సక్సెస్! || Sunil Naren super Success as a opener in the absence of cris Lyn KKR vs Punjab

సునీల్ నరైన్.. మొన్నటి వరకూ సంచలన బౌలర్ మాత్రమే. పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో ఈ వెస్టిండీస్ ఆటగాడి బౌలింగ్ ప్రదర్శన అతడిని స్టార్ ప్లేయర్ గా మార్చింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ లలో ఇతడికి డిమాండ్ ను పెంచింది. మరి తన బౌలింగ్ తోనే సంచలనంగా నిలిచిన నరైన్ ఒక్కసారిగా బ్యాటింగ్ తో చర్చనీయాంశంగా మారాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో నైట్ రైడర్స్ విజయంలో నరైన కీలక పాత్ర పోషించాడు. ముందుగా బౌలింగ్ లో నాలుగు ఓవర్లకు 19 పరుగులిచ్చి ఒక వికెట్ ను కూల్చి రాణించిన నరైన్ ను ఆసక్తికరమైన వ్యూహంతో ఓపెనర్ గా బరిలో దింపాడు నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్.

ఐపీఎల్ లో నరైన్ ఓపెనర్ గా రావడం ఇదే తొలి సారి. క్రిస్ లియాన్ అందుబాటులో లేకపోవడంతో నరైన్ ఓపెనర్ గా రంగంలోకి దిగాడు. 170 పరుగుల లక్ష్య చేధనలో గంభీర్ తో కలిసి మైదానంలోకి వచ్చిన నరైన్ తన హిట్టింగ్ తో అదరగొట్టేశాడు. రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్ తో నరైన్ బ్యాటింగ్ సాగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నరైన్, గంభీర్ ల జోడీ ఐపీఎల్ లో వేగంగా పరుగులు చేసిన ఓపెనర్స్ గా నిలిచింది. నైట్ రైడర్స్ 8.1 ఓవర్లకే వంద పరుగుల మార్కును చేరిందంటే.. దానికి కారణం నరైన్, గంభీర్ ల దూకుడే.


Score board : KXIP 170/9 (20 OVERS)

kkr 171/2 (16.3 OVERS)

sUNIL naren is man of the match 

1 comment: