కరీబియన్ విధ్వంసక వీరుడు క్రిస్‌గేల్ టీ20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కెరీర్‌లో 290 మ్యాచ్‌లాడిన గేల్ మొత్తం 10,000 పరుగులు చేసి ఔరా అనిపించాడు. తాజాగా గుజరాత్ లయన్స్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో థంపీ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ 10వేల మార్కు అందుకున్నాడు. ఇన్ని మ్యాచ్‌లు ఆడినా.. గేల్ స్ట్రైక్‌రేట్ 149.0 ఉండటం విశేషం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాస్ తదితర ప్రైవేట్ టోర్నీలు సైతం ఆడిన ఈ హిట్టర్ మంచినీళ్ల ప్రాయంలా సిక్స్‌లు బాదుతూ అలవోకగా భారీ స్కోరు సాధించేస్తుంటాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో విభేదాలు కారణంగా ఆ దేశ జట్టుకు ఇటీవల దూరమైన క్రిస్‌గేల్.. ప్రైవేట్ లీగ్‌లు మాత్రం వదిలిపెట్టడం లేదు. టీ20 పరుగుల్లో గేల్ తర్వాత మెక్‌కలమ్ (7,524),
బ్రాడ్ హడ్జ్ (7,338),
డేవిడ్ వార్నర్ (7,156),
కీరన్ పొలార్డ్ (7,087) వరుసగా టాప్-5లో ఉన్నారు.
This comment has been removed by the author.
ReplyDelete