Saturday, 15 April 2017

అరకు అందాల వీక్షణకు ఇక ‘విస్టాడోమ్’ || Passinger Train Between Vishakapatnam and Araku valley to see the beauty of the nature

విశాఖపట్నం-అరకు మధ్య రైలు ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆంధ్రా ఊటీగా పిలుచుకునే ఈ అరకు అందాలను వీక్షించడానికి ఎక్కడెక్కడినుంచో పర్యాటకులు వస్తుంటారు. విశాఖపట్నం నుంచి కిరండోల్ పాసెంజర్ రైలుపై సొరంగ మార్గాల గుండా వెళ్తూ తెగ సంబరపడిపోతుంటారు. కానీ సాధారణ రైలు బోగీల్లో ప్రయాణిస్తూ కొండలు, గుహల అందాలను అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నామనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారికోసం భారతీయ రైల్వే కొత్తరకం రైలు బోగీలను తీసుకొచ్చింది. ‘విస్టాడోమ్’గా పిలిచే ఈ అద్దాల రైలు బోగీల్లోనుంచి ప్రకృతి అందాలను మరింత స్పష్టంగా వీక్షించొచ్చు. సీట్లలో కూర్చొనే అద్దాలలో నుంచి లోయలు, కొండలను చూడొచ్చు...

ఈ విశాఖపట్నం-అరకు ‘విస్టాడోమ్’ బోగీని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదివారం ప్రారంభించారు. భువనేశ్వర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనికి పంచజెండా ఊపారు. ఈరోజు విశాఖపట్నం-అరకు మార్గంలో ఈ బోగీతో ప్రత్యేక రైలును ట్రైల్ రన్ వేస్తున్నారు. ట్రైల్ రన్ విజయవంతం అయిన తరవాత మరో బోగీని కలుపుతారు. అయితే ఈ విస్టాడోమ్ బోగీలతో ప్రత్యేక రైలును నడుపుతారా లేక ఈ బోగీలను ఇప్పుడున్న కిరండోల్ పాసెంజర్ రైలుకు కలుపుతారా అనే విషయంపై స్పష్టతలేదు. ఏదేమైనా ఈ బోగీల్లో అయితే పర్యాటకులు ప్రయాణించొచ్చు. ఒక ‘విస్టాడోమ్’ బోగీ తయారీకి అయిన ఖర్చు రూ. కోటి. ఈ ఏసీ బోగీలో 70 శాతం ట్రాన్సపరెంట్ గ్లాసే ఉంటుంది.

1 comment: